పోటీ పరీక్షల్లో జనరల్ అవేర్నెస్/నాలెడ్జ్ విభాగంలో అత్యంత ముఖ్యమైనవి అంతర్జాతీయ అవార్డులు. వీటిపై ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రశ్నలుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ అవార్డులు, వాటిని అందించే సంస్థలు, గ్రహీతల వివరాలు..
రామన్ మెగసెసె అవార్డులు
రామన్ మెగసెసె పొందిన భారతీయులు:ఆచార్య వినోభా భావే (1958), సి.డి.దేశ్‌ముఖ్ (1959), మదర్ థెరిస్సా (1962), వర్గీస్ కురియన్ (1963), జయప్రకాశ్ నారాయణ్ (1965), సత్యజిత్ రే (1967), ఎం.ఎస్. స్వామినాథన్ (1971), ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (1974), ఇలాభట్ (1977), అరుణ్‌శౌరి (1982), ఆర్.కె.లక్ష్మణ్ (1984), బాబా ఆమ్టే (1985), కిరణ్‌బేడి (1994), టి.ఎన్.శేషన్ (1996), మహాశ్వేతాదేవి (1997), అరుణారాయ్ (2000), రాజేంద్రసింగ్ (2001), సందీప్ పాండే (2002), శాంతాసిన్హా (2003), జె.ఎం.లింగ్డో (2003), అరవింద్ కేజ్రీవాల్ (2006), పాలగుమ్మి సాయినాథ్ (2007), నీలిమా మిశ్రా(2011), కులంది ఫ్రాన్సిస్ (2012).
2013 రామన్ మెగసెసె గ్రహీతలు: హబీబా సరాబి (అప్ఘానిస్థాన్), లపాయ్ సెంగ్ రా (మయన్మార్), ఎమెస్టో డొమింగో (ఫిలిప్పైన్‌స), కరప్షన్ ఎరాడికేషన్ కమిషన్ (ఇండోనేషియా), శక్తి సమూహ (నేపాల్).
నోబెల్ బహుమతులు
కొన్ని ఆసక్తికర విషయాలు:
- నోబెల్ శాంతి బహుమతిని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థకు మూడుసార్లు (1917, 1944, 1963) ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న అత్యంత పిన్నవయస్కురాలు తవక్కల్ కర్మన్. ఆమెకు 2011లో 32 ఏళ్ల వయసులో లభించింది.
- ఇప్పటివరకు 43 మంది మహిళలకు ప్రదానం చేశారు. నోబెల్ బహుమతిని రెండుసార్లు అందుకున్న ఏకైక మహిళ మేరీ క్యూరీ. ఆమెకు 1903లో ఫిజిక్స్‌లో, 1911లో కెమిస్ట్రీలో నోబెల్ లభించింది.
- బ్రిటిష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్‌కు 1953లో సాహిత్యంలో నోబెల్ లభించింది.
- నోబెల్ బహుమతి పొందిన అత్యంత పిన్నవయస్కుడు లారెన్స బ్రాగ్. ఆయనకు కేవలం 25 ఏళ్ల వయసులో, 1915లో, భౌతిక శాస్త్రంలో లభించింది.
- అత్యంత పెద్ద వయస్కుడు లియోనిడ్ హర్విజ్. ఆయనకు 90 ఏళ్ల వయసులో 2007లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ లభించింది.
- నోబెల్ బహుమతిని తిరస్కరించిన వ్యక్తులు ఇద్దరు. 1964లో జీన్‌పాల్ సార్తే(సాహిత్యం), 1973లో లెడక్ థో (శాంతి).
- మరణానంతరం ఇద్దరికి లభించింది. డాగ్ హామర్సజోల్డ్ (1961, శాంతి), ఎరిక్ ఎక్సెల్ కాల్ఫెల్డ్ (1931, సాహిత్యం).
- లైనస్ పౌలింగ్ - కెమిస్ట్రీ (1954), శాంతి (1962)
- జాన్ బర్దీన్ - ఫిజిక్స్ (1956, 1972)
- మేరీ క్యూరీ - ఫిజిక్స్ (1903), కెమిస్ట్రీ (1911)
- ఫెడరిక్ సాంగర్ - కెమిస్ట్రీ (1958, 1980)
- యునెటైడ్ నేషన్స హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్(యూఎన్‌హెచ్‌సీఆర్) - శాంతి (1954, 1981)నోబెల్ బహుమతి పొందిన భారతీయులు: ఏడుగురు. వారు.. రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, సాహిత్యం), సి.వి.రామన్ (1930, భౌతికశాస్త్రం), హరగోబింద్ ఖొరానా (1968, వైద్యశాస్త్రం), మదర్‌థెరిస్సా (1979, శాంతి), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983, భౌతికశాస్త్రం), అమర్త్యసేన్ (1998, ఆర్థికశాస్త్రం), వెంకట్రామన్ రామకృష్ణన్ (2009, రసాయనశాస్త్రం). నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ పేరును ఐదుసార్లు ప్రతిపాదించారు. 1937, 1938, 1939, 1947, 1948లలో నామినేట్ అయినప్పటికీ ఆయనకు నోబెల్ లభించలేదు.
భౌతికశాస్త్రం - సెర్‌జ హరోష్ (ఫ్రాన్స), డేవిడ్ వైన్‌లాండ్ (అమెరికా)
రసాయనశాస్త్రం - రాబర్ట లెఫ్కోవిట్జ్, బ్రయాన్ కోబిల్కా (అమెరికా)
వైద్యశాస్త్రం-జాన్ గర్డన్ (బ్రిటన్), షిన్యా యమనాకా (జపాన్)
సాహిత్యం - మోయాన్ (చైనా)
ఆర్థిక శాస్త్రం - ఆల్విన్ రాథ్, లాయిడ్ షేప్లీ (అమెరికా)
శాంతి - యూరోపియన్ యూనియన్ (ఈయూ)
2012లో ప్రైజ్‌మనీ 1.2 మిలియన్ డాలర్లు. 2013 నోబెల్ బహుమతులను అక్టోబర్‌లో ప్రకటిస్తారు.
రైట్ లైవ్లీహుడ్ అవార్డులు
2012 విజేతలు: సీమా సమర్ (అఫ్ఘానిస్థాన్), క్యాంపేన్ ఎగెనెస్ట్ ఆర్మ్స ట్రేడ్ (యూకే), జీన్ షార్ప (యూఎస్ఏ), హెరెటిన్ కరాకా (టర్కీ).
ప్రపంచ ఆహార బహుమతి
ఆహార నాణ్యతను మెరుగుపరిచి, ఆహార భద్రతకు కృషి చేసే వ్యక్తులకు ఈ అవార్డును ఇస్తారు. ఈ అవార్డును నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవమైన అక్టోబర్ 16న వీటిని ప్రదానం చేస్తారు. విజేతలకు 2,50,000 డాలర్లను బహూకరిస్తారు. ఈ బహుమతి మొదటిసారి 1987లో భారతదేశ హరిత విప్లవ పితామహుడైన ఎం.ఎస్.స్వామినాథన్‌కు లభించింది. 1989లో శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్‌కు ఇచ్చారు.
2013 విజేతలు: మేరీ డెల్ షిల్టన్, రాబర్ట ఫ్రాలే (యూఎస్ఏ), మార్‌కవాన్ మాంటేగ్ (బెల్జియం)
ఆస్కార్ అవార్డులు
85వ అకాడమీ అవార్డులు: వీటిని ఫిబ్రవరి 24, 2013న ప్రదానం చేశారు. లైఫ్ ఆఫ్ పై చిత్రానికి నాలుగు ఆస్కార్లు లభించాయి. ఉత్తమ చిత్రం - ఆర్గో, ఉత్తమ దర్శకుడు - ఆంగ్లీ (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ నటుడు - డేనియల్ డే లూయిస్ (లింకన్), ఉత్తమ నటి - జెన్నిఫర్ లారెన్స (సిల్వర్ లైనింగ్స ప్లేబుక్), ఉత్తమ సహాయనటుడు - క్రిస్టోఫ్ వాల్జ్ (జాంగో అన్చైన్డ), ఉత్తమ సహాయ నటి - అన్నీ హతవే (లెస్ మిజరబుల్స్), ఉత్తమ విదేశీ చిత్రం - అమోర్ (ఆస్ట్రియా) 86వ అకాడమీ అవార్డులను మార్చి 2, 2014న ప్రదానం చేస్తారు. 2014 అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో గుజరాతీ భాషా చిత్రం ‘ద గుడ్ రోడ్’ నామినేట్ అయింది.
మ్యాన్‌బుకర్ ప్రైజ్
మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
ఏబెల్ ప్రైజ్
నార్వే గణిత శాస్త్రవేత్త నీల్స్ హెన్రిక్ ఏబెల్ పేరు మీద 2003లో ఏర్పాటు చేశారు. 1 మిలియన్ డాలర్లు బహూకరిస్తారు. 2013లో ఈ బహుమతి బెల్జియం గణిత శాస్త్రవేత్త పియరీ డెలిగ్నేకు లభించింది.
ప్రిట్ట్జ్ కర్ ప్రైజ్
ఆర్కిటెక్చర్లో ప్రదానం చేస్తారు. 1979లో ప్రారంభించిన ఈ బహుమతి కింద ఒక లక్ష డాలర్లను ఇస్తారు. దీన్ని ఆర్కిటెక్చర్లో నోబెల్ బహుమతిగా అభివర్ణిస్తారు. 2013లో జపాన్‌కు చెందిన టోయో ఇటోకు ఈ బహుమతి లభించింది.
టెంపుల్టన్ ప్రైజ్
అమెరికాకు చెందిన టెంపుల్టన్ ఫౌండేషన్ 1973లో ఆధ్యాత్మిక విభాగంలో ఈ బహుమతిని ప్రవేశ పెట్టింది. 11 లక్షల పౌండ్లను బహుమతిగా ఇస్తారు. 1973లో తొలి విజేత మదర్ థెరిస్సా. 1975లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు, 1990లో బాబా ఆమ్టేకు, 1997లో పాండురంగ శాస్త్రి అథవలెకు ఈ అవార్డు లభించింది. 2013లో దక్షిణాఫ్రికాకు చెందిన డెస్మండ్ టూటుకు ప్రదానం చేశారు.
ప్రిట్ట్జ్ కర్ ప్రైజ్
టెంపుల్టన్ ప్రైజ్
ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
- 2012 సంవత్సరానికి మోయాన్ (చైనా) ఏ రంగంలో నోబెల్ బహుమానం పొందారు?
- 2012 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన ఇద్దరూ ఏ దేశానికి చెందినవారు?
- 2012కి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందినవారు?
- 2012కి నోబెల్ బహుమానం పొందినవారిలో అధిక సంఖ్యాకులు ఏ దేశస్థులు?
- 2012కి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందినవారు?
- టెంపుల్టన్- 2012 ప్రైజ్ ఎవరికి లభించింది?
- నోబెల్ బహుమానాన్ని పొందిన మొదటి భారతీయుడు?
- జూలియన్ బార్న్స్కి 2011 బుకర్‌ప్రైజ్ ఏ పుస్తకానికి వచ్చింది?
- భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన తొలి భారతీయుడు?
సమాధానాలు:
5) రాబర్ట లెఫ్కోవిట్జ్, బ్రయాన్ కోబిల్కా 6) దలైలామా, 7) రవీంద్రనాథ్ ఠాగూర్, 8) ద సెన్స ఆఫ్ యాన్ ఎండింగ్, 9) సి.వి.రామన్.